శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై వర్సిటీ వీసీ రామకృష్ణా రెడ్డి, అధ్యాపకులు , సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై వర్సిటీ వీసీ రామకృష్ణా రెడ్డి, అధ్యాపకులు , సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఇనాక్.. ఎస్కేయూ కళాశాలలో 31 ఏళ్ల పాటు తెలుగు అధ్యాపకుడిగా, రెండేళ్లపాటు ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. ఎస్కేయూ ఖ్యాతిని ఇనుముడింప చేయడానికి కృషి చేశారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు.