అన్ని పార్టీల సూచనలు స్వీకరించాం: కొడాలి నాని

Kodali Nani: We Received Instructions From All Parties Said In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా : ప్రజలకు సంక్షేమ పాలన అందించే దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాలన సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. జిల్లాలోని మచిలీపట్నంలో శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. సమీక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఇచ్చిన సూచనలు, సలహాలు స్వీకరించామని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు లాగా ప్రజలకు అమలు కాని హామీలు సీఎం జగన్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చిన చంద్రబాబుకు బుద్ది రాలేదని మండిపడ్డారు. 

సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిసే టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు, వరదలు రావడంతో రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు.. మల్లాది విష్ణు, రక్షణనిధి, రమేశ్‌ బాబు, దూలం నాగేశ్వరరావు, జోగి రమేశ్‌, కైలే అనిల్‌ కుమార్‌, వసంత కృష్ణ ప్రసాద్‌, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top