కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు | Sakshi
Sakshi News home page

కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు

Published Fri, May 16 2014 7:44 PM

కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు - Sakshi

'గుడివాడ ఎవడబ్బ సొత్తూ కాదు' అని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి కొడాలి నాని నిరూపించారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొడాలి నాని భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ...ఓట్ల తేడాతో గెలుపొందారు.  ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.

ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నానికి గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది. కృష్ణాజిల్లా వైఎస్సార్‌సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు.

ఇక ఓ పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీనపడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అట్లూరి సుబ్బారావు నామమాత్రంగానే నిలిచారు.

Advertisement
Advertisement