breaking news
kodali Venkateswara Rao
-
ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరావు సతీమణి కన్నుమూత
కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. కొందరు కరోనాకు బలైపోతుంటే.. మరికొందరూ ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. తాజా టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం(మే 4) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిత ఈ రోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి అనిత సైతం కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించింది. -
కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు
'గుడివాడ ఎవడబ్బ సొత్తూ కాదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని నిరూపించారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొడాలి నాని భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ...ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నానికి గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది. కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఓ పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీనపడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అట్లూరి సుబ్బారావు నామమాత్రంగానే నిలిచారు.