
'ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడతా'
టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు ఎన్టీఆర్, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ల ఆశయాల కోసం పాటుపడతానని గుడివాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నాని స్పష్టం చేశారు.
తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు నందమూరి తారక రామారావు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల ఆశయాల కోసం పాటుపడతానని గుడివాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నాని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా బుధవారం కృష్టాజిల్లా గుడివాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొడాలి నాని మాట్లాడారు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చేందుకు కృషి చేయాలని టీడీపీని కొడాలి నాని డిమాండ్ చేశారు.