కియాలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభం | Kia restart Car manufacturing in Anantapur | Sakshi
Sakshi News home page

కియాలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభం

May 12 2020 7:34 PM | Updated on May 12 2020 7:41 PM

Kia restart Car manufacturing in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : కియా ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని అంతర్జాతీయ కియా మోటర్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి మళ్లీ మొదలైంది. కియా రోజుకు 400 కార్ల తయారీని చేపట్టింది. పనిచేసేందుకు 500 మంది కార్మికులకు అనుమతి లభించింది.

లాక్ డౌన్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్ల ఉత్పత్తి చేస్తామని కియా యాజమాన్యం తెలిపింది. ఇక, కంటైన్మేంట్ జోన్లలో నివసించే కార్మికుల సెలవులను పొడగించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముంద్తు జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement