
సాక్షి, అనంతపురం : విద్యార్థుల వద్ద డిపాజిట్ల పేరుతో కోట్ల స్కాంతో సంచలనం సృష్టించిన కేశవరెడ్డి విద్యాసంస్థల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీప బంధువును కాపాడేందుకు టీడీపీ సర్కార్ పావులు కదుపుతోంది. జిల్లాలో మొత్తం 1428మంది బాధితులు ఉండగా.. కేవలం 13 మందినే సాక్ష్యులుగా ఏపీ సీఐడీ చేర్చింది.
కేశవరెడ్డికి అనుకూలంగా సీఐడీ వ్యవహరిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమనూ సాక్ష్యులుగా చేర్చాలని పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేశవరెడ్డి బాధితులుకు న్యాయవాదులు హరినాథ రెడ్డి, విజయ కుమార్, సీపీఎం నేత రాంభూపాల్ అండగా నిలిచారు. కేశవరెడ్డి బాధితుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని కేశవరెడ్డి బాధితులు, ప్రజా సంఘాలు నిర్ణయించాయి.