'మాజీ మంత్రి అంటే గుండెల్లో కలుక్కుమంటోంది' | KE prabhakar attended jyotirao pule birth celebrations | Sakshi
Sakshi News home page

'మాజీ మంత్రి అంటే గుండెల్లో కలుక్కుమంటోంది'

Apr 11 2015 7:01 PM | Updated on Aug 10 2018 8:13 PM

'మాజీ మంత్రి అంటే గుండెల్లో కలుక్కుమంటోంది' - Sakshi

'మాజీ మంత్రి అంటే గుండెల్లో కలుక్కుమంటోంది'

' ప్రతి ఒక్కరూ మాజీ మంత్రి... మాజీ మంత్రి అని సంభోదిస్తుంటే.. గుండెల్లో కలుక్కుమంటోంది..

కర్నూలు(అర్బన్): ' ప్రతి ఒక్కరూ మాజీ మంత్రి... మాజీ మంత్రి అని సంభోదిస్తుంటే.. గుండెల్లో కలుక్కుమంటోంది..అందుకే త్వరలోనే మంత్రినవుతాను' అంటూ మాజీ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ అన్నారు. కర్నూలులో శనివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రూ.25 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బీసీలు ఎంతో కృషి చేశారన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement