బాలుడిని ఢీకొట్టిన డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ | KE Krishnamurthy convoy hits kid in Kurnool | Sakshi
Sakshi News home page

బాలుడిని ఢీకొట్టిన డిప్యూటీ సీఎం కాన్వాయ్‌

Aug 23 2018 1:03 PM | Updated on Aug 23 2018 2:18 PM

KE Krishnamurthy convoy hits kid in Kurnool - Sakshi

కర్నూలు : కర్నూలులోని సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఓ బాలుడిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement