కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు | KCR talking cross | Sakshi
Sakshi News home page

కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు

Oct 27 2014 11:57 PM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు - Sakshi

కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు

సాక్షి, తిరుమల : తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని, హుందాగా వ్యవహరించాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు.

ఎంపీ రాయపాటి సాంబశివరావు

 సాక్షి, తిరుమల : తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని, హుందాగా వ్యవహరించాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. సోమవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తి విషయంలో కేసీఆర్ పొంతనలేని మాటలు, చేష్టలతో ఆ రాష్ర్ట ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

తన చేతకానితనంతో సమస్యను అధిగమించలేక పక్క రాష్ట్రాన్ని బాధ్యులను చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. రూ.16 వేల కోట్ల లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు సమర్థతతో వ్యవహరిస్తున్నారన్నారు. అంతకుముందు ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement