విశాఖ గ్యాస్‌ లీకేజీపై నేడు విచారణ

Karikalavalavan Committee Investigation On LG Polymers Gas Leakage - Sakshi

సాక్షి, విజయవాడ : విశాఖ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఉదంతంపై పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికలవలవన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో నేడు  విచారణ జరగనుంది. గ్యాస్‌ లీకేజీ ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. కాగా విచారణ నేడు మధ్యాహ్నం 12గంటలకు మొదలు కానుంది. కమిటీ విచారణ బృందంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఛైర్మన్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్,ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం , ఎనర్జీ నిపుణులు, హెచ్ పీసీఎల్ సాంకేతిక నిపుణులు, ఆంధ్రా యూనివర్సివర్సిటీ నిపుణులు ఉన్నారు. (గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతులు)

కాగా గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్యాస్‌ లీకేజీ ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు బాధితులను పరామర్శించారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అలాగే వెంటిలేటర్‌ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top