సొంతపార్టీ నేతలపై మండిపడ్డ కరణం, అయ్యన్న | Karanam Balaram And Ayyana Patrudu Fires On TDP Activists In Vijayawada | Sakshi
Sakshi News home page

సొంతపార్టీ నేతలపై మండిపడ్డ కరణం, అయ్యన్న

Feb 11 2020 7:10 PM | Updated on Feb 11 2020 8:24 PM

Karanam Balaram And Ayyana Patrudu Fires On TDP Activists In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో భాగంగా ఈ పార్టీ సీనియర్‌ నేతలు అయ్యన్న పాత్రుడు, కరణం బలరాంలు పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యాలయం నుంచి నేతలకు సమన్వయం సరిగా లేదని అయ్యన్న, కరణంలు మండిపడ్డారు. రేపు నిర్వహించాల్సిన కార్యక్రమంపై ఈరోజు రాత్రి సమాచారం ఇవ్వడం ఏంటని నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే నాయకులు షో వర్క్‌ చేయడం మానేసి పార్టీ కార్యక్రమాల్లో​ పాల్గొంటే బాగుంటుదని పేర్కొన్నారు. అంతేగాక పార్టీ నేతలు ప్రెస్‌మీట్లు తగ్గించి పని మీద దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిదని అయ్యన్న, కరణంలు హితభోద చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement