‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడం లేదు’ | Kanna Lakshmi Narayana About Party Membership | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీలపై ఉన్నది ఆరోపణలే : కన్నా

Jul 11 2019 6:18 PM | Updated on Jul 11 2019 9:22 PM

Kanna Lakshmi Narayana About Party Membership - Sakshi

సాక్షి, విజయనగరం : టీడీపీ ఎంపీలపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమే.. అవి నిజం కావాలని లేదు కదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ ఎన్‌డీఏకు పట్టం కట్టేలా చేశాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి, మెచ్చి, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక సంస్థల దాడులను ప్రశ్నించడం దౌర్భాగ్యం అన్నారు కన్నా.

బీజేపీని అనడం సరి కాదు : పురంధరేశ్వరి
కర్ణాకటలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీజేపీని బాధ్యులని చేయడం సరికాదన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. కాంగ్రెస్‌ నన్ను క్లర్క్‌ కన్నా హీనంగా చూస్తుందని అనేక సందర్భాల్లో కుమార్‌ స్వామి స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్‌-జేడీఎస్‌ అంతర్గత విబేధాలే కారణం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement