తణుకులో తళుక్కుమన్న సినీతార కామ్న
సినీ తార కామ్న జఠ్మలాని శుక్రవారం తణుకులో తళుక్కుమన్నారు. తణుకు రాష్ట్రపతిరోడ్డులో తనిష్క క్లాత్ షోరూం ప్రారంభోత్సవానికి
సినీ తార కామ్న జఠ్మలాని శుక్రవారం తణుకులో తళుక్కుమన్నారు. తణుకు రాష్ట్రపతిరోడ్డులో తనిష్క క్లాత్ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె రావటంతో అభిమానులు, సినీ ప్రేమికులతో రాష్ట్రపతి రోడ్డు నిండిపోయింది. జనం ఒక్కసారిగా షోరూంలోకి చొచ్చుకురావడంతో పోలీసులు అదుపుచేయాల్సి వచ్చింది. కామ్న జ్యోతి ప్రజ్వలన చేయగా, షోరూంను ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, లైనిన్ క్లబ్ కౌంటర్‌ను పారిశ్రామికవేత్త ఆరిమిల్లి రామకృష్ణ (రాము) ప్రారంభించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ షోరూంలో మహిళల అభీష్టానికి తగ్గ అన్ని రకాల చీరలు, చుడీదార్‌లు ఉన్నాయని తెలిపారు. షోరూం అధినేతలు వి.ప్రదీప్, వి.సురేష్, పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.