'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలే నష్టపోతారు' | Jayaprakash narayan takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలే నష్టపోతారు'

Jun 20 2015 12:14 PM | Updated on Mar 9 2019 4:13 PM

'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలే నష్టపోతారు' - Sakshi

'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలే నష్టపోతారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆరోపించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆరోపించారు. ఇలా చేయడం వల్ల నష్టపోయేది చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని... ప్రజలే నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జేపీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు ప్రాంతాల మధ్య సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదాలను కేంద్రప్రభుత్వం పరిష్కరించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జేపీ విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పూర్తిసామరస్యంతో ఉన్నారని తెలిపారు. ఓ పౌరయుద్ధం, హింస రావాలని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. అయితే ప్రజల్లో విజ్ఞత ఉందని... దాన్ని పోగొట్టాలని చూస్తున్నారని జేపీ ఆందోళనవ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement