సీఎం జగన్‌ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం | Janasena MLA Abhishekam To CM YS JAgan Flexy With Milk | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

Oct 19 2019 8:40 AM | Updated on Oct 19 2019 9:05 AM

Janasena MLA Abhishekam To CM YS JAgan Flexy With Milk - Sakshi

సీఎం జగన్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న రాపాక. చిత్రంలో మంత్రి విశ్వరూప్‌

సాక్షి, అమలాపురం రూరల్‌: వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వడంపై ది సెంట్రల్‌ డెల్డా ఆటో వర్కర్స్‌ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్‌ ఆటోస్టాండ్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పాదయాత్రలో జగన్‌ తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వారికి ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు.

ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement