
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ : అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందంటూ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో 35 శాతం మద్యం అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనచైతన్య వేదిక, వావిలాల సంస్థ సంయుక్తంగా ఈనెల(జూన్) 13న విజయవాడ ఎంబీ భవన్‌లో.. మద్య వ్యతిరేక ఉద్యమ సదస్సు నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు.