breaking news
Janachaithanya vedika
-
‘సమాచార’ కమిషనర్లను నియమించండి
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సమాచార కమి షనర్లను, కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్‌ను నియమించా లని జన చైతన్య వేదిక డిమాండ్ చేసింది. అలాగే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లోకయుక్త, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను నియమించాలని కోరిం ది. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేస్తున్నాయని, వివిధ పార్టీల పాలనలో ఉన్న కేరళ, ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సమా చార కమిషన్ ఏమాత్రం పనిచేయడం లేదని అన్నారు. మాజీ సమాచార కమిషనర్ పి.విజయబాబు ప్రసంగిస్తూ తిరుమల దేవాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలన్నారు. ఏపీలో సమాచార కమిషన్ దాదాపు పనిచేయడం లేదని చెప్పారు. ఏపీలో ముఖ్య కమిషనర్‌తో పాటు కమిషనర్ల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని, దాదాపు 10 వేల ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు వివిధ రాష్ట్రాల సమా చార కమిషనర్ల వద్ద 9 లక్షలకు పైగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయని అప్పా డైరెక్టర్ ఎస్. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అవినీతిలో ఏపీ దేశంలోనే అగ్రభాగాన ఉందని, క్షేత్ర స్థాయిలో అవినీతి లేనిదే పనులు కాని పరిస్థితి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతోందని వాపోయారు. -
‘ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు’
సాక్షి, విజయవాడ : అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందంటూ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో 35 శాతం మద్యం అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనచైతన్య వేదిక, వావిలాల సంస్థ సంయుక్తంగా ఈనెల(జూన్) 13న విజయవాడ ఎంబీ భవన్లో.. మద్య వ్యతిరేక ఉద్యమ సదస్సు నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. -
జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్
హైదరాబాద్: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది. వైవిద్యం గల పంటల ఫోటో ఎగ్జిబిషన్ గా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.