స్కామ్‌ల బాబూ... మీరా నీతులు చెప్పేది | Jakkampudi Vijaya Lakshmi fire on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

స్కామ్‌ల బాబూ... మీరా నీతులు చెప్పేది

Nov 11 2017 7:09 AM | Updated on Aug 14 2018 11:26 AM

Jakkampudi Vijaya Lakshmi fire on CM  Chandrababu Naidu  - Sakshi

సీతానగరం (రాజానగరం): స్కామ్‌ల బాబూ...మీరా నీతులు చెప్పేది.. నీపై ఉన్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీఎం చంద్రబాబుకు హితవు  పలికారు. శుక్రవారం సీతానగరంలో ప్రయివేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న  జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ ప్యారడైజ్‌ పేపర్లంటూ తనకు అనుకూలమైన పత్రికల్లో రాయించుకొని ... వాటి ఆధారంగా చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజా సంకల్పం యాత్రలో జగన్‌ విసిరిన సవాల్‌కు చంద్రబాబు దిమ్మతిరిగిందన్నారు.

జగన్‌లో చిత్తశుద్ధి ఉంది కాబట్టే సవాల్‌ విసిరారని, మరి మీరు చేసిన స్కామ్‌లపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. విదేశాలలో అక్కౌంట్లు ఉన్నది తండ్రీ, కొడుకులకేనని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంచనాలు పెంచే స్కామ్, జన్మభూమి కమిటీ స్కామ్, వేసవి మజ్జిగ పేరుతో, చంద్రన్న కానుక, సదావర్తి భూముల్లో అవినీతి, రాజధాని, ఇసుక, పుష్కరాల్లో, బొగ్గు కొనుగోలు, పోలవరం, పట్టిసీమ ఇలా ఏ రంగం తలుచుకున్నా అందందే అవినీతి తన్నుకొస్తోందని అన్నారు.

ఓటుకు నోటు స్కామ్‌తో హైదరాబాద్‌ వదిలి అమరావతి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్, మంత్రులు జైలుకు వెళతారని వివరించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని కైవసం చేసుకుంటున్నారని, భాధితులకు న్యాయం చేయకుండా కాకమ్మ కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ పెదపాటి డాక్టర్‌బాబు, పార్టీ నాయకులు వలవల రాజా,   చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement