కిరణ్ 'జై సమైక్యాంధ్ర' తొలి కార్యవర్గం భేటీ | Jai samaikyandhra party council first meeting | Sakshi
Sakshi News home page

'జై సమైక్యాంధ్ర' తొలి కార్యవర్గం భేటీ

Mar 12 2014 3:30 PM | Updated on Jul 29 2019 5:31 PM

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన జై సమైక్యాంధ్ర పార్టీ తొలి కార్యవర్గం బుధవారం సమావేశమైంది.

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన జై సమైక్యాంధ్ర పార్టీ తొలి కార్యవర్గం బుధవారం సమావేశమైంది. కిరణ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. మరోవైపు జై సమైక్యాంధ్ర తొలిసభ స్థానిక జెమినీ గ్రౌండ్స్లో ఈరోజు సాయంత్రం జరగనుంది.  ఈ సభలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్ కీలకంగా నిలవనుండగా మాజీమంత్రి పితాని సత్యనారాయణ, దాసరి నారాయణరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర హాజరు కానున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement