గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రిలో చేపట్టిన పనుల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రిలో చేపట్టిన పనుల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా వివరించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన రాజా పుష్కర పనులను అధికారపార్టీ నేతలు పంచేసుకుని దోచుకున్నారని చెప్పారు.
పనుల్లో అవినీతే కాక ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు, సేవలందించడంలో కూడా విఫలమైందన్నారు. వివిధప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు వైఎస్‌ఆర్ ఫౌండేషన్ తరఫున పార్టీ నాయకులంతా సమన్వయంతో సేవాకార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని, స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు అనేక సేవలందించాయని రాజా చెప్పారు. సేవా సంస్థలు ముందుకు రాకుంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు.