అర్ధరాత్రి వరకూ ఆస్పత్రిలో జగన్‌మోహన్‌రెడ్డి | Jagan Mohan Reddy till midnight hospital | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వరకూ ఆస్పత్రిలో జగన్‌మోహన్‌రెడ్డి

Jan 9 2015 3:07 AM | Updated on Jul 25 2018 4:09 PM

అర్ధరాత్రి వరకూ ఆస్పత్రిలో జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi

అర్ధరాత్రి వరకూ ఆస్పత్రిలో జగన్‌మోహన్‌రెడ్డి

పెనుకొండ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

బాధితులకు ఓదార్పు

 హిందూపురం: పెనుకొండ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గలో వచ్చిన ఆయన బుధవారం మావటూరు, చెరుకూరు, తదితర గ్రామాలను సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతరం రాత్రి 10 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

చికిత్స పొందుతున్న 56 మందినీ పేరుపేరున పలకరిస్తూ వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఆయన ఆసుపత్రిలోనే గడిపారు. పిల్లల ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లతో ఆరా తీశారు. రేపటి నుంచి నవీన్ నిశ్చల్ మీ వెన్నంటే  ఉంటారన్నారు. మీరు ఆసుపత్రి నుంచి  క్షేమంగా ఇళ్లకు చేరేదాకా  సహాయ సహకారాలు అందిస్తారన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement