ఇది ప్రజా ఉద్యమం! | It is a mass movement | Sakshi
Sakshi News home page

ఇది ప్రజా ఉద్యమం!

Aug 30 2015 4:52 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఇది ప్రజా ఉద్యమం! - Sakshi

ఇది ప్రజా ఉద్యమం!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన బంద్ ప్రజా ఉద్యమమని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకులు

అరెస్టులు అప్రజాస్వామికం
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

 
 అనంతపురం  : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన బంద్ ప్రజా ఉద్యమమని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథూన్‌రెడ్డి అన్నారు. పోలీసుల ద్వారా బంద్‌ను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. బంద్ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన నాయకులను త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తి స్వార్థం కోసమో.. ఒక పార్టీ స్వార్థం కోసమో.. ఈ బంద్‌ను నిర్వహించలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలన్నారు.

పోలీసు లాఠీలతో, తూటాలతో ఉద్యమాలను అణిచివేసే శక్తి ముఖ్యమంత్రికి లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement