ఐటీగ్రిడ్స్‌ స్కాం: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు

IT Employees Attend Before Judge On IT Grid Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉద్యోగులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్‌, ఫణి, విక్రమ్‌ గౌడ్‌, చంద్రశేఖర్‌లను సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు కుందన్‌బాగ్‌లోని హైకోర్టు జడ్జి నివాసం వద్దకు వారిని తీసుకువచ్చారు. వారితో పాటు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ నివాస్‌ కూడా హాజరైయారు. ఇదిలావుండగా తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ ఉద్యోగులు కనిపించడంలేదంటూ సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ కోర్టును ఆశ్రయించారు.

టీడీపీ యాప్‌ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థే పౌరుల డేటా చోరీ స్కామ్‌కు పాల్పడినట్టు గుట్టురటైన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వారివద్ద ఉందని తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఐటీగ్రిడ్స్‌పై నగరంలో మరోకేసు నమోదైంది. సేవమిత్ర ఆప్‌ పేరుతో ప్రభుత్వ లబ్దిదారుల సమాచారాన్ని చోరీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ యూత్‌ వింగ్‌కు చెందిన రామ్‌రెడ్డి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరుకు విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top