ఏపీ తీరంలో భారత్, అమెరికా సైనిక విన్యాసాలు

India And US To Tri Service Exercise In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అమెరికా, భారత్‌ త్రివిధ దళాలు ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోని సాగ ర జలాల్లో విన్యాసాలు నిర్వహించి తమ సైనిక పాటవాన్ని ప్రపంచ దేశాలకు చాటనున్నాయి. ఈ నెల 14 నుంచి 8 రోజుల పాటు విశాఖలోని తూర్పునౌకాదళ ప్రధాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖ, కాకినాడ తీరాలు దీనికి వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే ఇరుదేశా ల రక్షణ, విదేశాంగ మంత్రులు దీనిపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడటంతో పాటు భద్రత, పరస్పర సహకారం, విపత్తుల వేళ పరస్పర తోడ్పాటు వంటి అంశాలను బలోపేతం చేసుకోవడమే విన్యాసాల ప్రధాన లక్ష్యమని నౌకాదళాధికారులు చెబుతున్నారు.  

పులి విజయం పేరుతో..
ఈ ప్రతిష్టాత్మక విన్యాసాలను ‘టైగర్‌ ట్రయాంఫ్‌’ (పులి విజయం) పేరుతో నిర్వహించనున్నారు. 500 మంది అమెరికన్‌ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది దీనిలో పాల్గొనున్నారు.   

శాంతియుతంగా ఇండో పసిఫిక్‌ సాగర జలాలు
ఇండో, పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి సంయుక్త విన్యాసాలు ఉపయోగపడతా యని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. టైగర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాల కంటే ముందుగా.. భారత్, అమెరికా సంయుక్తంగా వివిధ దేశాలతో కలిసి యూఎస్‌–ఆసియా ఉమ్మడి సైనిక విన్యాసాలు, జపాన్, భారత్, ఫిలిప్పీన్స్‌తో సంయు క్తంగా కార్యక్రమాలు నిర్వహించాయి.

తీవ్రవాద సంస్థలకు హెచ్చరికలు
ప్రపంచ దేశాల్లో పేట్రేగుతున్న ఉగ్రవా దంపై ఉక్కుపాదం మోపేందుకు, తీవ్రవాద సంస్థలకు భారత్, అమెరికా ఆయుధ సంపత్తి సత్తా చాటేందుకు టైగ ర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాలు ప్రధాన వేది క కానున్నా యి. భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ జలషా్వ, ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌తో పాటు అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ జర్మన్‌ టౌన్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో ఆకర్షణగా నిలవనున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top