స్వాతంత్య్ర సంబరం | Independence celebration | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సంబరం

Aug 15 2015 11:43 PM | Updated on May 25 2018 9:20 PM

స్వాతంత్య్ర సంబరం - Sakshi

స్వాతంత్య్ర సంబరం

స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం ఆయా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ

పార్టీ కార్యాలయాల్లో...
స్వాతంత్య్ర దిన వేడుకలను ప్రజలంతా శనివారం ఆనందోత్సాలతో జరుపుకున్నారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. పలు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు,  ఆయా పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
 
 డాబాగార్డెన్స్ : స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం ఆయా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర మైనార్టీ విభాగ కన్వీనర్ మహ్మద్ షరీఫ్, ప్రచార కార్యదర్శి భర్కత్ ఆలీ, సత్తి రామకృష్ణారెడ్డి,  పీతల మూర్తి యాదవ్, రొంగలి జగన్నాథం, పీతల వాసు, పక్కి దివాకర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 కాంగ్రెస్,సీపీఐ కార్యాలయాల్లో..
 అల్లిపురం: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాసరావు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, సేవాదళ్ చైర్మన్ పెంటపల్లి సత్యనారాయణ, బమ్మిడి గంగాధర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, గుంటూరు భారతి, వేగి దివాకర్ పాల్గొన్నారు. సీపీఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  

 బీజేపీ కార్యాలయంలో
 ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయంలో ఎంపీ హరిబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీనియర్ నాయకుడు పి.వి.చలపతిరావు, నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు పాల్గొన్నారు.
 
 ప్రభుత్వ కార్యాలయాల్లో...
 మహారాణిపేట : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎన్.యువరాజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో జేసీ జనార్దన్ నివాస్, జేసీ-2 డి.వెంకటరెడ్డి, డీఎస్‌ఓ జె.శాంతకుమారి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.జయప్రకాశ్‌నారాయణన్, పీఆర్, మినిస్టీరియల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, జిల్లా సమాచార కార్యాలయంలో సమాచారశాఖ అడిషనల్ డెరైక్టర్ డి.శ్రీనివాస్, కేజీహెచ్‌లో సూపరింటెండెంట్ మధుసూదన్‌బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 జిల్లా కోర్టులో...
 విశాఖ లీగల్ :జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.జయసూర్య పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.ఎస్.సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి చీమలపాటి శేఖర్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.  

 వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయంలో...
 ఆశీల్‌మెట్ట దరి వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయంలో మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజక వర్గ సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్ జాతీయ పతాకాన్ని కుటుంబసమేతంగా ఎగురవేశారు.

Advertisement
 
Advertisement
Advertisement