ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా ఖైదీ నిరశన | indefinite fast by prisoner against encounters | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా ఖైదీ నిరశన

Apr 14 2015 7:38 PM | Updated on Sep 3 2017 12:18 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ఒకేరోజు 25 మందిని హతమార్చడాన్ని మావోయిస్టు ఖైదీ సాకే కృష్ణ గర్హించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ఒకేరోజు 25 మందిని హతమార్చడాన్ని మావోయిస్టు ఖైదీ సాకే కృష్ణ గర్హించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయన.. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి నుంచి నిరశన చేపడుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులుకు సమాచారం ఇచ్చారు.

 

ఇదే విషయాన్ని జైలర్ మీడియాకు చెప్పారు. 2003లో అలిపిరి వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో సాకే కృష్ణ నిదితుడు.

Advertisement
 
Advertisement
Advertisement