మేమేం పాపం చేశాం.. | Illegal relationships collapse the Human lifes | Sakshi
Sakshi News home page

మేమేం పాపం చేశాం..

Jul 11 2017 11:44 AM | Updated on Sep 5 2017 3:47 PM

ఏం జరుగుతుందో ఆ చిన్నారులకు తెలియడం లేదు.. ఇంటికి పోలీసులెందుకు వస్తున్నారో..

► నాన్నను చంపేశారు..
► అమ్మను అరెస్ట్‌ చేశారు.
► బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు


రామభద్రపురం: ఏం జరుగుతుందో ఆ చిన్నారులకు తెలియడం లేదు.. ఇంటికి పోలీసులెందుకు వస్తున్నారో.. తల్లిని ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక బిత్తర చూపులు చూస్తున్నారు. నాన్న కనిపించడు.. అమ్మ పోలీస్‌స్టేషన్  ఉంది.. ఈ పరిస్థితుల్లో చిన్నారుల బేల చూపులు బంధువులు, స్థానికులను కలిచివేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... బాడంగి మండలం కోటిపల్లికి చెందిన కొయ్యాన ధనుంజయను (29)ను అతని భార్య రామలక్ష్మి, ఆమె ప్రియుడు బోగాది గణపతి హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గణపతి కూడా కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఉన్న ఒక్క నిందితురాలు రామలక్ష్మిని విచారణ నిమిత్తం సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లారు.

 అమ్మ వెంటే..
ధనుంజయ, రామలక్ష్మి దంపతులకు హరి (7), ఉమ (3) పిల్లలున్నారు. ధనుంజయ హత్యకు గురికావడం.. తల్లిని పోలీసులు తీసుకెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటికి వస్తుండడంతో హరి భయపడతాడని భావించిన బంధువులు అతడ్ని తాత గారింటికి పంపించి వేశారు. కుమార్తె ఉమ మాత్రం తల్లితోనే ఉంది. తల్లిని పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్తున్న సమయంలో కూడా ఏమీ తెలియని చిన్నారి ఆమె వెంటే స్టేష్టన్ కు వెళ్లింది. ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి అక్కడే ఆడుకోవడం చూసి స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

కొంపముంచుతున్న అక్రమ సంబంధాలు
ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న అక్రమ సంబంధాల వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయని పలువురు తెలిపారు. తల్లి చేతిలో తండ్రి బలయ్యాడు.. తల్లి పోలీసుల అదుపులో ఉంది.. ఇటువంటి సమయంలో పిల్లలను ఎలా ఊరడించాలో తెలియక బంధువులు తల్లడిల్లుతున్నారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement