పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్ | I never leave Ysr congress party, says Jaleel khan | Sakshi
Sakshi News home page

పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్

Oct 29 2014 3:44 AM | Updated on May 25 2018 9:17 PM

పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్ - Sakshi

పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్

తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టంచేశారు.

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
 సాక్షి, హైదరాబాద్ : తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తల్లో  నిజం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టంచేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిం చారు. ఏ పత్రికగాని, టీవీ చానల్ గాని తమపై ఒక వార్తను ఇచ్చే ముందు అందు లో వాస్తవం ఎంత ఉందో నిర్థారించుకోవడానికి తమను సంప్రదించాల్సి ఉందని.. కానీ తనపై వార్త ప్రచురించిన పత్రిక ఆ పని చేయలేదని ఆయన తప్పుపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement