
వారితో పాటు..కుక్కపిల్లకూ ఉరేశారు..
భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భార్య, కూతుళ్ల ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం జరిగింది.
ప్రకాశం: భర్త అరెస్ట్ తో భార్య, కూతుళ్ల ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో మనస్తాపానికి గురైన అతడి భార్య కనకరత్నం, కూతురు శ్రుతి ఇంట్లో ఉన్న కుక్కపిల్లకు కూడా ఉరేసి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే కుక్క ఒంటరిది అయిపోతుందని భావించి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కపిల్లకు కూడా ఉరి వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.