జగన్‌కు మద్దతుగా కువైట్‌లో దీక్షలు | Hunger strike in Kuwait to support YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌కు మద్దతుగా కువైట్‌లో దీక్షలు

Sep 1 2013 3:50 AM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్‌కు మద్దతుగా కువైట్‌లో దీక్షలు - Sakshi

జగన్‌కు మద్దతుగా కువైట్‌లో దీక్షలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావంగా కువైట్‌లోని పార్టీ ఎన్నారై విభాగం నేతలు మలియా ప్రాంతంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

 సాక్షి, హైదరాబాద్: న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావంగా కువైట్‌లోని పార్టీ ఎన్నారై విభాగం నేతలు మలియా ప్రాంతంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కాంగ్రెస్, టీడీపీలు ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, కానీ జైల్లో ఉన్నా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ నిజమైన ప్రజానాయకుడని పలువురు నాయకులు పేర్కొన్నారు. తామంతా వైఎస్సార్‌సీపీ సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement