కనకదుర్గ వారధిపై భారీ అగ్నిప్రమాదం | Huge fire accident at Kanakadurga Varadhi | Sakshi
Sakshi News home page

కనకదుర్గ వారధిపై భారీ అగ్నిప్రమాదం

Apr 30 2015 11:37 AM | Updated on Mar 22 2019 1:41 PM

వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పేయింట్ వేస్తున్న వ్యక్తులను ఢీకొట్టింది.

గుంటూరు: వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పేయింట్ వేస్తున్న వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారి వద్ద ఉన్న పేయింట్‌కు యాక్సిడెంట్ ద్వారా పుట్టిన మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిమీద ఉన్న కనకదుర్గ వారధిపై గురువారం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement