కన్నుల పండువగా ప్రభల తీర్థం

కనుమ సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో జరిగిన ప్రభల తీర్థానికి జనం పోటెత్తారు. 410 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్న ఈ ప్రభల తీర్థం ఆద్యంతం నయనానందకరంగా సాగింది. సుమారు 20 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ఉన్న భారీ ప్రభలను భక్తులు తమ భుజాలపై మోసుకుంటూ తీర్థానికి తీసుకొచ్చారు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారాలకు చెందిన ప్రభలను ఎగువ కౌశిక (కాలువ) దాటించే దృశ్యాన్ని భక్తులు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. జగ్గన్నతోటతోపాటు కోనసీమలో చిన్నా, పెద్దా కలిపి సుమారు 40 గ్రామాల్లో ప్రభల తీర్థాలు జరిగాయి. - సాక్షి, అమలాపురం