'రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేస్తా' | huge development in AP with in two years, says chandrababu | Sakshi
Sakshi News home page

'రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేస్తా'

Jul 17 2014 2:04 PM | Updated on Sep 2 2017 10:26 AM

'రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేస్తా'

'రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేస్తా'

ప్రజలకు అందుబాటులో ఉండడానికే జిల్లా పర్యటనలు చేపట్టినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

జంగారెడ్డిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ప్రజలకు అందుబాటులో ఉండడానికే జిల్లా పర్యటనలు చేపట్టినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల హామీలు నేరవేరుస్తామని చెప్పారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ జరుగుతుందన్నారు. కుటుంబానికి ఒక రుణమాఫీ మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు.

పోలవరం ముంపు బాధితుల్ని ఆదుకుంటామని హామీయిచ్చారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. గిరిజన హక్కులు కాపాడే విధంగా మెరుగైన పునరావాసం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ను మించిన నాలుగు నగరాలను ఏపీలో నిర్మిస్తామని వాగ్దానం చేశారు. రాబోయే రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధిస్తానని చెప్పారు.

తీరప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడం, జిల్లాలోని దేవాలయాన్నింటిని అనుసంధానం చేస్తూ పర్యాటక అభివృద్ధి సాధించడం, జిల్లా అభివృద్ధిపై అధికారుల సూచనలను ఈ సందర్భంగా చంద్రబాబు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement