అక్టోబర్ 23లోగా ఇళ్ల నిర్మాణం | Housing construction by October 23 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 23లోగా ఇళ్ల నిర్మాణం

Sep 5 2015 12:56 AM | Updated on Aug 21 2018 8:34 PM

జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులంతా అక్టోబరు 23 నాటికల్లా గృహ ప్రవేశాలు చేయడానికి అనువుగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్

 ఏలూరు (మెట్రో) : జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులంతా అక్టోబరు 23 నాటికల్లా గృహ ప్రవేశాలు చేయడానికి అనువుగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి, శింగన్నపల్లి, రామన్నపాలెం, మామిడిగొంది, తోటగొంది గ్రామాల నిర్వాసితుల కోసం చేపట్టిన 700 గృహాలు పూర్తిస్థాయిలో నిర్మించాలని గృహనిర్మాణశాఖ పీడీ ఇ.శ్రీనివాస్‌ను ఆదేశించారు. జిల్లాలో సేద్యపునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వాసితులందరికీ వచ్చేవారం లోగా పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టాలంటే కేవలం కాగితాల రూపంలో కాకుండా లబ్ధిదారులను భూమిలో కూర్చోబెట్టి హద్దులు చూపించి ఫొటో తీసి ఆ తర్వాత పట్టా అందించాలే తప్ప తూతూమంత్రంగా కాగితాలపై పట్టాల పంపిణీ చేశామనే విధానం ఆచరించవద్దని తహసిల్దార్లకు చెప్పారు.
 
 భూసేకరణకు నిధుల కొరత లేదు
 జిల్లాలో సేద్యపు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు నిధుల కొరతలేదని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. భూమిసేకరించిన 24 గంటల్లోగా సొమ్ము రైతులకు చెల్లించాలని ఈ విషయంలో జాప్యం చేస్తే సహించబోమని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల ప్రగతితీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డెప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండివారిగూడెం ఎక్కడ ఉంది, ఆ గ్రామంలో 128 ఎకరాల భూమి సేకరించి గ్రాయత్రీ ఏజెన్సీకి అప్పగించగా అక్కడ పని జరుగుతుందా అని కలెక్టర్ ప్రశ్నించారు. దీనిపై రాజు సమాధానం చెబుతూ తనకేమీ తెలియదని, కార్యాలయంలోనే తన విధులు ఉంటాయని, సమావేశానికి వెళ్లాలని ఎస్‌ఈ చెప్పడంతో హాజరయ్యూయని చెప్పారు. సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో పంపించనందుకు ఎస్‌ఈ యాదవ్‌పై ఎందుకు చర్య తీసుకోరాదో సంజాయిషీ నోటీసు జారీ చేయాలని ఆర్డీవో ప్రభాకరరావును కలెక్టర్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement