breaking news
October 23
-
దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే?
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగ సందర్భంగా హాలీడేను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, దసరా సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇంతకు ముందు 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని సర్కార్ పేర్కొంది. ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలంగాణలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అలాగే, రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ వెల్లడించారు. కాలేజీలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు ఛాతీలో ఇన్ఫెక్షన్ -
అక్టోబర్ 23లోగా ఇళ్ల నిర్మాణం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులంతా అక్టోబరు 23 నాటికల్లా గృహ ప్రవేశాలు చేయడానికి అనువుగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి, శింగన్నపల్లి, రామన్నపాలెం, మామిడిగొంది, తోటగొంది గ్రామాల నిర్వాసితుల కోసం చేపట్టిన 700 గృహాలు పూర్తిస్థాయిలో నిర్మించాలని గృహనిర్మాణశాఖ పీడీ ఇ.శ్రీనివాస్‌ను ఆదేశించారు. జిల్లాలో సేద్యపునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వాసితులందరికీ వచ్చేవారం లోగా పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టాలంటే కేవలం కాగితాల రూపంలో కాకుండా లబ్ధిదారులను భూమిలో కూర్చోబెట్టి హద్దులు చూపించి ఫొటో తీసి ఆ తర్వాత పట్టా అందించాలే తప్ప తూతూమంత్రంగా కాగితాలపై పట్టాల పంపిణీ చేశామనే విధానం ఆచరించవద్దని తహసిల్దార్లకు చెప్పారు. భూసేకరణకు నిధుల కొరత లేదు జిల్లాలో సేద్యపు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు నిధుల కొరతలేదని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. భూమిసేకరించిన 24 గంటల్లోగా సొమ్ము రైతులకు చెల్లించాలని ఈ విషయంలో జాప్యం చేస్తే సహించబోమని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల ప్రగతితీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డెప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండివారిగూడెం ఎక్కడ ఉంది, ఆ గ్రామంలో 128 ఎకరాల భూమి సేకరించి గ్రాయత్రీ ఏజెన్సీకి అప్పగించగా అక్కడ పని జరుగుతుందా అని కలెక్టర్ ప్రశ్నించారు. దీనిపై రాజు సమాధానం చెబుతూ తనకేమీ తెలియదని, కార్యాలయంలోనే తన విధులు ఉంటాయని, సమావేశానికి వెళ్లాలని ఎస్ఈ చెప్పడంతో హాజరయ్యూయని చెప్పారు. సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో పంపించనందుకు ఎస్ఈ యాదవ్‌పై ఎందుకు చర్య తీసుకోరాదో సంజాయిషీ నోటీసు జారీ చేయాలని ఆర్డీవో ప్రభాకరరావును కలెక్టర్ ఆదేశించారు.