ఉద్యోగోన్నతుల ద్వారా హెచ్‌ఎం పోస్టుల భర్తీ | HM posts recruitment by employee promotions | Sakshi
Sakshi News home page

ఉద్యోగోన్నతుల ద్వారా హెచ్‌ఎం పోస్టుల భర్తీ

Aug 5 2014 2:42 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి తెలిపారు. అరండల్‌పేటలోని తన కార్యాలయంలో ఆమె సోమవారం మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతుల ప్రక్రియపై దృష్టి సారించామని చెప్పారు.

 గురజాల(గుంటూరు),  అద్దంకి(ప్రకాశం), పల్లెపాడు, రాపూరు(నెల్లూరు)ల్లోని ప్రభుత్వ హైస్కూళ్ల హెచ్‌ఎం పోస్టులను జోనల్ స్థాయిలో సీనియార్టీ ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నామని వివరించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

అదే విధంగా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు ఆయా జిల్లాల డీఈవోలు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో చేపట్టే అవకాశముందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement