పెళ్లితో ఒక్కటైన హెచ్‌ఐవీ బాధిత జంట | HIV Victims couple Marriage in srikakulam | Sakshi
Sakshi News home page

పెళ్లితో ఒక్కటైన హెచ్‌ఐవీ బాధిత జంట

Jun 26 2014 2:08 AM | Updated on Sep 2 2018 4:48 PM

పెళ్లితో ఒక్కటైన హెచ్‌ఐవీ బాధిత జంట - Sakshi

పెళ్లితో ఒక్కటైన హెచ్‌ఐవీ బాధిత జంట

వాళ్లిద్దరూ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకొని తోటి వ్యాధిగ్రస్తులకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించారు. విషయాన్ని తాము చికిత్స పొందుతున్న

 రిమ్స్ క్యాంపస్: వాళ్లిద్దరూ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకొని తోటి వ్యాధిగ్రస్తులకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించారు. విషయాన్ని తాము చికిత్స పొందుతున్న సీఆర్‌ఎం సెంటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా వీరి నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. దీంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు సీఆర్‌ఎం సెంటర్‌లో చిట్టి, కల్యాణిలు హెచ్‌ఐవీ వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
 
 ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాల సభ్యుడు వీరి ప్రేమను అంగీకరించారు.  దీంతో మంగళవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వివాహాన్ని సీఆర్‌ఎం సెంటర్ నిర్వాహకుడు సింతు సూర్యనారాయణ దగ్గర ఉండి జరిపించారు. ఈ సందర్భంగా నవ దంపతులు మాట్లాడుతూ ఓ శిశువుకు జన్మనిచ్చి మా కుటుంబాల్లో ఆనందం నింపాలని నిశ్చయించుకున్నామని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు ఎటువంటి వ్యాధి సోకకుండా వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement