ఎల్బీనగర్‌లో కేజీ హెరాయిన్ పట్టివేత | Heroin worth Rs 1 crore seized in LB Nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌లో కేజీ హెరాయిన్ పట్టివేత

May 25 2015 6:43 PM | Updated on Sep 3 2017 2:40 AM

హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో సోమవారం సుమారు ఒక కేజీ హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ :  హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో సోమవారం సుమారు ఒక కేజీ హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హెరాయిన్‌ను నార్కొటిక్ సెంట్రల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement