ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ | Hero Nandamuri Bala krishna Enter In to Politics | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ

Apr 1 2014 8:31 AM | Updated on Sep 17 2018 5:18 PM

ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ - Sakshi

ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది... లేనిది త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది... లేనిది త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నం శివారులోని సింహచలంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీపై త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు.

 

మరో రెండు రోజులలో ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సమావేశమై చర్చిస్తానన్నారు. అనంతరం ఏ సంగతి ప్రకటిస్తాన్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో బాలకష్ణ మంగళవారం ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. బాలకృష్ణ వెంట విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement