తిరుమలలో కొలువైన కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం తెల్లవారుజామున పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు.
తిరుపతి: తిరుమలలో కొలువైన కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం తెల్లవారుజామున పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి మొక్కుల సమర్పించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులతో సహా స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు సమయం పడుతుంది.