సిద్దిపేటలో భారీ దోపిడీ | heavy roberry in siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో భారీ దోపిడీ

Aug 12 2013 12:44 AM | Updated on Aug 28 2018 7:30 PM

తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని సిద్దిపేట పట్టణంలోని పలు కాలనీలలో ఇటీవల దొంగలు తెగబడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని కుషాల్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చొరబడి భారీ దోపిడికి పాల్పడ్డారు.

సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని సిద్దిపేట పట్టణంలోని పలు కాలనీలలో ఇటీవల దొంగలు తెగబడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని కుషాల్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చొరబడి భారీ దోపిడికి పాల్పడ్డారు. 6 తులాల ఒక గ్రాము బంగారం, కిలో వెండి సామగ్రి, రూ.19 వేల నగదుతో పాటు పట్టు చీరలను అపహరించారు. ఈ చోరీ సంఘటన కుషాల్‌నగర్‌లో కల కలం రేపింది. కుషాల్‌నగర్‌లో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బేతి కంటి రాజయ్య వసంత దంపతులు రం జాన్ సందర్భంగా వరుసగా సెలవులు ఉండడంతో ఇంటికి తాళాలు వేసి తమ కూతురు నవ్య, అల్లుడు మల్లికార్జున్‌ల వద్దకు హైదరాబాద్ వెళ్లారు. ఇదే అనువుగా భావించిన దుండగులు కాంపౌం డ్‌వాల్ దూకి గొడ్డలి, ఎక్సాబ్లేడ్‌లను ఉపయోగించి డోర్ తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించారు.
 ఇంట్లో గల బీరువాను పగులగొట్టారు. సామగ్రినం తా చిందర వందర చేసి పడేశారు. 6 తులాల ఒక గ్రాము బంగారం,కిలో వెం డి సామగ్రి, రూ.19 వేల నగదుతో పా టు పట్టు చీరలను అపహరించారు. సుమారు రూ.3లక్షల విలువైన నగలు, నగదు అపహరించారు. ఆదివారం ఉద యం మెయిన్‌డోర్ కింది భాగం తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు హైదరాబాద్‌లో ఉన్న రాజయ్యకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీం తో రాజయ్య సిద్దిపేట పట్టణంలో ఉం టున్న బందువులకు విషయం తెలియపరిచి సిద్దిపేటకు బయలుదేరాడు. సం ఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్‌ఐ వరప్రసాద్ పరిశీలించారు. బాధితుడి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీపై స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసు లు పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement