రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు | Heavy rains over next 24 hours in North coastal Andhra and Telangana | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు

Aug 31 2014 9:25 AM | Updated on Sep 2 2017 12:41 PM

ఉత్తరకోస్తా, విదర్భ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.

విశాఖపట్నం: ఉత్తరకోస్తా, విదర్భ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. అల్పపీడన పరిసర ప్రాంతాలలో ఉపరితల అవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement