భారీ వర్షాల కారణంగా 17 మంది మృతి | Heavy downpour kills 17 people in AP | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల కారణంగా 17 మంది మృతి

Oct 25 2013 2:50 PM | Updated on Sep 1 2017 11:58 PM

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు వెల్లడించారు. భారీ వర్షాలపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా ... 3,050 ఇళ్లు ధ్వంసమైనాయని తెలిపారు. 2.50 లక్షల హెక్టార్ల మేర పంట నీట మునిగిందని పేర్కొన్నారు. 67,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

 

వరద బాధితుల కోసం 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 117 చెరువులకు గండ్లు పడ్డాయని తెలిపారు. 110 పశువులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. అయితే రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేసినట్లు  ఉన్నతాధికారులు చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement