అల్ప పీడన ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.
తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం
Nov 30 2015 12:59 PM | Updated on Sep 3 2017 1:16 PM
తిరుమల: అల్ప పీడన ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కాళంగి జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా తిరుమలలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంతో పాటు చలి తీవ్రత పెరగడంతో చంటి బిడ్డలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఘాట్ రోడ్ లో స్వల్పంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపధ్యంలో టీటీడీ వాహనదారులను అప్రమత్తం చేసింది. రోడ్లపై పడుతున్న చిన్న చిన్న బండరాళ్లను సిబ్బందితో తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement