వైఎస్సార్ సీపీకే కాపుల మద్దతు | He supported the tenants ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకే కాపుల మద్దతు

May 5 2014 2:42 AM | Updated on Aug 8 2018 5:33 PM

సార్వత్రిక ఎన్నికల్లో కాపు కులస్తులు వైఎస్సార్ సీపీకే మద్దతివ్వాలని కాపునాడు రాష్ట్ర కార్యదర్శి జె.ఎస్.ఆర్.నాయుడు కోరారు.

ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కాపు కులస్తులు వైఎస్సార్ సీపీకే మద్దతివ్వాలని కాపునాడు రాష్ట్ర కార్యదర్శి జె.ఎస్.ఆర్.నాయుడు కోరారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం ముదినేపల్లిలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాపు ద్వేషిగా వ్యవహరిస్తున్నారని, తమకు తక్కువ సీట్లు ఇచ్చి పక్షపాత వైఖరి నిరూపించున్నాని విమర్శించారు.

వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 6 ఎంపీ, 32 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి అభిమానాన్ని చాటుకున్నారని కొని యాడారు. జిల్లాలో కాపులకు ఆరు సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకే కాపు కులస్తులంతా మద్దతు ఇచ్చి అధికారంలోకి తేవాలన్నారు. ఏలూరు ఎంపీ, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థులు తోట చంద్రశేఖర్, ఉప్పాలను గెలిపిం చాలని కాపు కులస్తులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement