'సీఎంల సమన్వయంతో ముందుకెళ్తాం' | Harish rao and Devineni uma met with governor | Sakshi
Sakshi News home page

'సీఎంల సమన్వయంతో ముందుకెళ్తాం'

Feb 14 2015 3:02 PM | Updated on Oct 19 2018 7:19 PM

నాగార్జున సాగర్ నీటి వివాదంపై రాజ్ భవన్లో గవర్నర్ తో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల భారీ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం శనివారం ముగిసింది.

హైదరాబాద్: నాగార్జున సాగర్ నీటి వివాదంపై రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల భారీ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం శనివారం ముగిసింది. అనంతరం రెండు రాష్ట్రాల్లో మంత్రులు దేవినేని ఉమా, హరీష్రావు సంయుక్తం విలేకర్లతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల్లో రైతులు నష్టపోకుండా చూస్తామని స్పష్టం చేశారు.

అలాగే పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్యాంపైకి ఇరు రాష్ట్రాల పోలీసులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారని దేవినేని ఉమా, హరీష్రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement