ఇకపై ఏపీ నుంచే హజ్‌ యాత్ర..

Haj Vijayawada New Embarkation Point Will Be Opened Says Mukhtar Abbas Naqvi - Sakshi

సాక్షి, న్యూఢిలీ​: ఆంధ్రప్రదేశ్‌లో హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు కేంద్రం శుభవార్త తెలిపింది. హజ్‌ యాత్రపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. వచ్చే ఏడాది నుంచి యాత్రికులు విజయవాడ నుంచి నేరుగా హజ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన హజ్‌ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఏపీలోని ముస్లింలు హజ్‌ యాత్ర కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. హజ్‌యాత్ర ఖర్చులో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top