breaking news
Haj Trip
-
ఇకపై ఏపీ నుంచే హజ్ యాత్ర..
సాక్షి, న్యూఢిలీ: ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు కేంద్రం శుభవార్త తెలిపింది. హజ్ యాత్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. వచ్చే ఏడాది నుంచి యాత్రికులు విజయవాడ నుంచి నేరుగా హజ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన హజ్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఏపీలోని ముస్లింలు హజ్ యాత్ర కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. హజ్‌యాత్ర ఖర్చులో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. -
మృతుల్లో 14 మంది భారతీయులు
హజ్ తొక్కిసలాటలో మరో 13 మందికి గాయాలు * 719కి చేరిన మృతుల సంఖ్య మినా(సౌదీ అరేబియా): మక్కా దగ్గర్లో మినాలో గురువారం హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిలో 14 మంది భారతీయులు ఉన్నారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. చనిపోయిన భారతీయుల్లో ఇద్దరు హైదరాబాద్ వాసులు, ముగ్గురు తమిళనాడు వాసులు ఉన్నట్లు గుర్తించారు. మృతిచెందిన భారతీయుల సంఖ్య 14కు చేరినట్లు జెడ్డాలోని తమ కాన్సుల్ జనరల్ తెలిపారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్లో తెలిపారు. మృతుల ను గుర్తుపట్టేందుకు భారతీయ వలంటీర్లు పెద్ద సంఖ్యలో మక్కా చేరుకుని, అక్కడి అధికారులకు సాయం పడుతున్నారని వెల్లడించారు. కాగా, ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 719కి చేరింది. వీరిలో తమ దేశానికి చెందిన 31 మంది ఉన్నారని ఇరాన్, తమ పౌరులు ఆరుగురు ఉన్నారని పాకిస్తాన్ తెలిపాయి. దుర్ఘటన నేపథ్యంలో భద్రత నిర్వహణను సమీక్షించాలని సౌదీ రాజు అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో ముస్లింలకు సంఘీభావం తెలుపుతున్నామని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. మృతుల్లో మరో హైదరాబాదీ మహిళ సాక్షి, హైదరాబాద్: ఈ తొక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన బీబీజాన్ మృతిచెందడం తెలిసిందే. ఈమెతో పాటు హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని ఘాజీమిల్లత్ కాలనీకి చెందిన సబా తస్లీబ్(52) అనే మహిళ కూడా మృతిచెందినట్లు ఆమె కుమారుడు నిస్సార్ మహ్మద్ శుక్రవారం తెలిపారు. ఆమె అంత్యక్రియలను మక్కాలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సబా తన భర్త మహ్మద్ గౌస్‌తో కలసి మక్కా వెళ్లారు. ఆమె మృతివార్త తెలియడంతో కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు. సబా కుటుంబాన్ని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.