ట్విటర్‌ వేదికగా భగత్‌సింగ్‌కు నివాళులు అర్పించిన సీఎం జగన్‌

Gurram Joshua Jayanti Celebrations At AP CM Camp Office In Vijayawada  - Sakshi

సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ నందిగం సురేష్‌, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు.

అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు.


భగత్‌సింగ్‌కు నివాళుర్పించిన జగన్‌..
స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ట్విటర్‌ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన  చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్‌ సింగ్‌ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top